![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -979 లో.. శైలెంద్రని దేవయాని తీసుకొని రాజీవ్ ని కలవడానికి తను చెప్పిన చోటుకి వస్తుంది. ఫారెన్ నుండి వచ్చిన శైలేంద్రకి రాజీవ్ గురించి తెలియదు కాబట్టి తన చరిత్ర మొత్తం చెప్తుంది. అయిన మనం ఇప్పుడు అతన్ని ఎందుకు కలవడానికి వచ్చాము? మనకేంటి లాభమని శైలేంద్ర అంటాడు. వాడికి ఆ వసుధార కావాలి. మనకి ఆ కాలేజీ కావాలి. ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తే బాగుంటుందని దేవయాని చెప్తుంది.
ఆ తర్వాత వసుధారకి రిషి వీడియోని చక్రపాణి పంపిస్తాడు. అది చూసిన వసుధార.. ఏంటి రిషి సర్ డల్ గా కన్పిస్తున్నారని చక్రపాణికి ఫోన్ చేస్తుంది. ఏమైంది నాన్న సర్ డల్ గా ఉన్నారని అనగానే.. ఏం లేదు బాగున్నారని చెప్తాడు. అలా రిషి బాగోగులు వసుధార కనుక్కుంటుంది. అప్పుడే మహేంద్ర అనుపమ వస్తారు. చక్రపాణితో రిషి గురించి అడిగి తెలుసుకుంటాడు మహేంద్ర. బాగా చూసుకోమని చక్రపాణికి మహేంద్ర చెప్తాడు. ఆ తర్వాత వసుధార ఏడుస్తు.. సర్ కి దూరంగా ఉండాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని అంటుంటే అనుపమ దైర్యం చెప్తుంది. మరొకవైపు దేవాయని వాళ్ళ దగ్గరికి రాజీవ్ వస్తాడు. శైలేంద్రతో రాజీవ్ పొగరుగా మాట్లాడుతుంటే శైలెంద్రకి కోపం వస్తుంది. నా చరిత్ర మొత్తం మేడమ్ చెప్పిందా అని అడుగుతాడు. ఇందాకే తెలుసుకున్నాను కానీ వసుధార అంటే నీకు అంత ఇష్టం కదా? తనకి ఎందుకు నువ్వు ఇష్టం లేదని శైలేంద్ర అడుగుతాడు. రాహీవ్ సైలైంట్ గా ఉంటాడు. అయిన తనకి పెళ్లి అయింది కదా అని శైలేంద్ర అనగానే.. మరి నాక్కూడా అయింది. ఇప్పుడు ఈక్వల్ కదా అని రాజీవ్ తల తిక్కగా సమాధానం చెప్తుంటాడు. వసుధారని నా సొంతం చేసుకోవడంలో మీరు సాయం చేస్తారని వచ్చానని రాజీవ్ అంటాడు.
ఆ తర్వాత రాజీవ్ కి దేవాయని జరిగిన సంఘటనలన్ని చెప్తుంది. నాకు నా మరదలు పిల్ల కావాలి. నీకు ఆ ఎండీ సీట్ కావాలి. ఈ రెండింటికి ఆ రిషి అడ్డు.. వాడిని లేకుండా చేస్తే నీ లైన్ క్లియర్ నా లైన్ క్లియర్ అని రాజీవ్ అంటాడు. నేను చూసుకుంటాను నువ్వు నా మరదలు పిల్లని అప్పగించే పనిలో ఉండమని రాజీవ్ అంటాడు. ఇద్దరు క్రిమినల్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. మరొకవైపు కాలేజీలో బోర్డు మీటింగ్ అరెంజ్ చేసి వసుధారకి బోర్డు మెంబర్స్ యూత్ ఫెస్టివల్ ఎప్పుడు చేస్తూ వస్తున్నాం.. ఇప్పుడు కూడా చెయ్యాలని అడుగుతారు. వసుధార దాని గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |